- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ గ్రామపంచాయతీ పరిధిలోని వైకుంఠ గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించేందుకు గడ్డి మందులు పచికారి చేశామని సర్పంచ్ యంబరి విద్య తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు ముళ్ళపొదలు, పిచ్చి మొక్కలు, గడ్డి విపరీతంగా పెరిగిపోయాయని, ఎవరైన మృతి చెందితే స్మశాన వాటికకు వెళ్లేందుకు దారి సరిగ్గా లేదనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు పిచ్చి మొక్కలను తొలగించి, గడ్డి మందు పిచికారి చేయించామని సర్పంచ్ చెప్పారు.
- Advertisement -



