Saturday, August 29, 2026
E-PAPER
Homeఖమ్మంగ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి

- Advertisement -

– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా పాలనకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వయంగా వింటున్నట్లు తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చొరవ చూపాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలందించాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చి, మిగిలిన సమయాన్ని గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి వినియోగించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన వారికి పథకాలు అందేలా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -