Monday, April 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంUS-Israel-Iran War : హర్మూజ్‌ను దిగ్బంధించండి : ట్రంప్‌

US-Israel-Iran War : హర్మూజ్‌ను దిగ్బంధించండి : ట్రంప్‌

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఇరాన్‌తో చర్చలు విఫలమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్టు చెప్పారు. జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా లేదా నిష్ర్కమించకుండా అమెరికా నౌకలు అడ్డుకోవడం మొదలుపెడతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు.

అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు. సరైన సమయంలో ఇరాన్‌ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -