– రూ.1.22 లక్షల నగదు, రెండు కార్లు, 16 ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై సివిల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,22,310 నగదు, రెండు కార్లు, 16 మోటార్ సైకిళ్లు, 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ టి.యయాతి రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



