Monday, April 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలునటి త్రిష నివాసానికి బాంబు బెదిరింపు

నటి త్రిష నివాసానికి బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చెన్నైలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా పంపిన ఈ హెచ్చరికతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే… చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తక్షణమే తమ ఆధీనంలోకి తీసుకుని, భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు రంగంలోకి దిగి ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కేవలం ఒక తప్పుడు సమాచారం అని పోలీసులు ధృవీకరించారు. ఈ తప్పుడు బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాంకేతిక ఆధారాలను సేకరిస్తోంది. ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -