Monday, April 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం : సీఎం రేవంత్‌ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం : సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. లోక్‌సభ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

‘‘లోక్‌సభ సీట్ల పెంపు విషయంపై అఖిలపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు వేర్వేరనేది ప్రతి పౌరుడికీ తెలుసు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో.. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని బీజేపీ చూస్తోంది. దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు ఈ విధానం అన్యాయం చేస్తుంది. భవిష్యత్‌లో దేశాన్ని బలహీనం చేస్తుంది. ఏ పార్టీకైనా జాతీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -