Monday, April 13, 2026
E-PAPER
Homeక్రైమ్మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను సిమెంట్ మిక్సర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ముర్బాద్ సమీపంలోని గోవిలి గ్రామం వద్ద ఉన్న రైతా వంతెనపై కళ్యాణ్ నుంచి ముర్బాద్ వెళ్తున్న వ్యాన్, ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ వాహనం ముఖాముఖి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -