నవతెలంగాన-హైదరాబాద్: జ్యోతిరావు పూలే, అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల నిర్ములన వారోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి. కుల నిర్మూలనపై వివిధ రకాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఆట పాటలతో, నృత్య ప్రదర్శనలతో కులం పేరుతో జరుగుతున్న ఆకృత్యాలను, దాడులను కండ్లకు కట్టిన్నట్లు తెలియజేస్తున్నారు. ఓట్ల సమయంలో కులంపేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న గారడీలను నాటక ప్రదర్శనతో తేటతెల్లం చేశారు పూలే, అంబేద్కర్ ఆశయాలతో కులరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు కాంక్షించారు. మూడు రోజుల నుంచి కొనసాగున్న వారోత్సవాలకు భారీ యోత్తున్న ప్రజలు తరలివచ్చారు. అదే విధంగా సమాజంలో కులం పేరుతో జరిగిన దాడులను ఫొటో ప్రదర్శన రూపంలో అందుబాటులో ఉంచారు. ఈ నెల 11 నుంచి 14 వరకు కుల నిర్మూలన వారోత్సవాలు జరగనున్నాయి.







