Wednesday, September 2, 2026
E-PAPER
Homeజాతీయంకేరళలో SFI ఆందోళన

కేరళలో SFI ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆందోళన చేపట్టింది. కేరళ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక ప్రదర్శన సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్య ప్రసాద్, రాష్ట్ర సచివాలయ సభ్యురాలు వైష్ణవి షాజీతో సహా తమ విద్యార్థి నాయకులపై పోలీసులు దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తిరువనంతపురంలోని కేరళ సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించింది. ఆ ఘర్షణలో తమ సభ్యులపై పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేశారని,వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. సచివాలయం వైపు సాగుతున్న నిరసనకారులను నిలువరించడానికి పోలీసులు వాటర్ ఫిరంగులు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -