Wednesday, September 2, 2026
E-PAPER
Homeజాతీయంనేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ వరద బాధితులకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన ఆపన్న హస్తం అందించారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది నిరాశ్రయులైన వేళ, వారికి అండగా నిలిచేందుకు నిత్యావసర సరుకులతో కూడిన సహాయ సామగ్రితో నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. అక్కడి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి సోనూ సూద్ సాయం చేసి ఆదుకున్నాడు. నేపాల్‌లో సంభవించిన ఈ ఘోర వరదల కారణంగా ఇప్పటివరకు 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా.ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -