నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని వార్డులో కొన్ని నెలలుగా మురికినీరు, వర్షపు నీరు ఇంటి ముందు,చుట్టుపక్కల చేరడంతో కాలనీలోని ప్రజలకు అటువైపు వెళ్లడానికి సమస్యలు తలెత్తుతున్నాయని వార్డు మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా వాడు మహిళలు మాట్లాడుతూ ఎప్పుడూ వర్షం పడిన పడకపోయినా మురికి కాలువలు పొంగిపొర్లి నీరు రోడ్లపైకి చేరుతుందని ఆరోపించారు. గ్రామపంచాయతీకి సంబంధించిన నీటి పన్ను , ఆస్తి పన్ను, వివిధ రకాల పన్నులు భారం మోపి ముక్కు పిండి వసూలు చేస్తున్న జిపి అధికారులకు సమస్యలు కంటికి కనబడడం లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా కాలనీలోని మురికి నీళ్లు నిలువ ఉండే ప్రాంతాన్ని నీటిని కాలువలోకి మళ్ళించే విధంగా ఏర్పాటు చేయాలని వార్డు నివసించే ప్రజలు, సభ్యులు, మహిళలు జిపి అధికారులు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు . ఇప్పటికైనా జిపి అధికారులు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఏర్పడిందని, లేకుంటే జిపి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతామని కాలనీవాసులు తెలిపారు.
మురికినీటి నిల్వా సమస్యలు..మహిళల ఆవేదన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



