నవతెలంగాణ-మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో ఏటీసీ సెంటర్ ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంగళవారం సందర్శించారు. ఈ క్రమంలో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఏటిసి నిర్మాణమని అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు మరింత నైపుణ్యం కలిగించాలని ఐటిఐ లను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఎంపిక చేసుకొని మొత్తం యావత్ రాష్ట్రంలోనే 100 ఏటీసీలను ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు.
తొలి విడతలోని 65 సెంటర్లలో మొదటగా ఏర్పాటు చేసిన కాటారంలో మొదటి సంవత్సరంలో 172 మంది అడ్మిషన్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రిన్సిపాల్, ట్రేడర్స్, డాటా సంస్థ వారి సంయుక్త సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్స్ యూనివర్సిటీ పక్షాన వారికి నైపుణ్యం తీసుకొచ్చే కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాటారం మండల కేంద్రంలో వివిధ మండలాల సంబంధించిన చిన్నారులందరు వచ్చి నైపుణ్యం సాధించుకోవాలని ఆశయం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఐటిఐ గాని, పాలిటెక్నిక్ గాని ప్రధాన సంస్థగా ప్రాధాన్యత కల్పించాలని పారిశ్రామిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆధునికరణ యంత్రాలతో పాత ట్రేడ్స్ వరకే పరిమితం కాకుండా రోబోటిక్స్ అదే విధంగా బ్యాటరీ సంబంధంగా మ్యానుఫ్యాక్చర్ సంబంధించింది ఉద్యోగ అవకాశాలను బట్టి ఆ యొక్క సెక్టార్‌ను గుర్తించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు వస్తున్న సందర్భంగా మన మండల కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమం మంచి వాతావరణంలో పూర్తి బిల్లింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాబ్స్, క్లాస్‌రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా యావత్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగ అవకాశాలు పెంచాలనీ దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాంలో, షూస్ సొంత ఖర్చులతో అందిస్తామని మంత్రి వెల్లడించారు.



