Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

పుష్కరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదించిన నూతన తీర్థాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు అవసరమైన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సిరోంచ–కాటారం ప్రాంతంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సిరోంచ బ్రిడ్జి నుంచి ప్రధాన ఘాట్ వరకు సుమారు 2 కిలోమీటర్లు, సరస్వతీ ఘాట్ నుంచి పక్షి తీర్థం వరకు 0.8 కిలోమీటర్ల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐదు తీర్థాల ప్రతిపాదిత స్థలాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.

అనంతరం ఆది ముక్తేశ్వర దేవాలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకు భూసేకరణ పూర్తయిన శాశ్వత రహదారి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు సిరోంచ బ్రిడ్జి సమీపంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కేటాయించిన ప్రాంతాన్ని కూడా అదనపు కలెక్టర్ పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

రీసర్వే పనులపై పరిశీలన అనంతరం కన్నెపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనులను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సర్వే సిబ్బందికి స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, మండల సర్వేయర్‌తో పాటు రెవెన్యూ  సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -