Wednesday, September 23, 2026
E-PAPER
Homeఖమ్మంత్వరితగతిన సర్వే పూర్తి చేయాలి

త్వరితగతిన సర్వే పూర్తి చేయాలి

- Advertisement -

– భూ రీసర్వే పరిశీలించిన తహశీల్దార్ దాసరి కిశోర్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

పారదర్శకత తో త్వరితగతిన భూ రీసర్వే పూర్తి చేయాలని తహశీల్దార్ దాసరి కిశోర్ సర్వే బృందానికి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం నాన్ క్యడస్ట్రల్ విభాగం లో మండలం లోని దురదపాడు లో నిర్వహిస్తున్న భూ రీసర్వే ని మంగళవారం డిప్యూటీ సర్వేయర్ నాగరాజు,ఆర్ఐ పద్మావతి తో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం నవతెలంగాణ తో మాట్లాడుతూ తెలంగాణలో భూ రీసర్వే సందర్భంలో ” నాన్ క్యడస్ట్రల్ అంటే పాత క్యాడస్ట్రల్ సర్వే రికార్డుల్లో స్పష్టమైన సర్వే నంబర్లు లేదా భూ హద్దుల వివరాలు అందుబాటులో లేని ప్రాంతం అని వివరించారు.ఇలాంటి ప్రాంతాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా గుర్తించి, మ్యాప్ చేసే ప్రక్రియ మాత్రమే నని అన్నారు.ఇప్పటికే 40 శాతం సర్వే పూర్తి అయ్యింది అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -