నవతెలంగాణ-మల్హర్ రావు
గర్భిణీలు,బాలింతలు,చిన్నారులు పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే వీలు ఉంటుందని మండలంలోని మల్లారం అంగన్ వాడి టీచర్లు పద్మ, అన్నారు.పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని మల్లారం సెంటర్-3లో పోషణ మాసం సందర్భంగా ఆహార పదార్థాలను ప్రదర్శించి పోషకాహారంపై అవగాహణ కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సర్పంచ్ మేకల రాజయ్య హాజరై మాట్లాడారు అంగన్ వాడిల ద్వారా గర్బినిలు,బాలింతలు, చిన్నారులకు పలు రకాల పోషకాహారం అందిస్తూ ఐసిడిఎస్ ఆరోగ్య తెలంగాణకు కృషి చేస్తోందన్నారు.తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మధు,గర్భినిలు,చిన్నారులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



