Wednesday, September 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్ పార్టీని నమ్మితే..ఆగమవుతామన్న కెసిఆర్ మాట నిజమైంది

కాంగ్రెస్ పార్టీని నమ్మితే..ఆగమవుతామన్న కెసిఆర్ మాట నిజమైంది

- Advertisement -

– ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన రేవంత్ రెడ్డికి పాలించే నైతికత లేదు
– కె.సి.ఆర్ పాలన రావడం తథ్యం… 
– సంక్షేమం సాగడం ఖాయం
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 
– కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యంపై వనపర్తి రాజీవ్ చౌరస్తాలో నిరసన సభ 
నవతెలంగాణ-వనపర్తి 
: కాంగ్రెస్ పార్టీని నమ్మితే.. ఆగమవుతామన్న కె.సి.ఆర్ మాట నిజమైందని, ఆమాట అనుభవంతోనే మాజీ సీఎం కె సి ఆర్ అన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమరభేరి మోగించారు. వనపర్తి రాజీవ్ చౌరస్తాలో నిరసన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా లోని బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు,మహిళలు పెద్దయేత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగం అవుతాము అన్న కె.సి.ఆర్ గారి మాట నేడు నిజమైంది అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలించే నైతికత లేదని దుయ్యబట్టారు. కె.సి.ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావడం తథ్యం అని, సుభిక్షంగా పాలన సాగడం ఖాయమని ప్రజలు అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెల్లువలా తరలివచ్చిన మహిళలను చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దినాలు దగ్గర పడ్డాయని ఖచ్చితంగా చెప్పగలనన్న ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు,11 డిక్లేషన్లు ఒక్కటిగా వివరిస్తూ అమలు జరిగాయని మహిళలను ప్రశ్నిస్తే లేదు లేదు అని ముక్తకంఠంతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చి అభివృద్ధిని అగ్రభాగములో నిలిపిన కె.సి.ఆర్ ను తూలనాడడం రేవంత్ రెడ్డికి తగదని హెచ్చరించారు.

33 నెలల పాలన ముప్పేట పాలు చేసిందన్నారు. 100 రోజులు గడువు హామీలు 1000 రోజులైనా రాలేదన్నారు. సిగ్గులేకుండా హెడ్ లైన్లో పేపర్ ప్రకటనలు ఇవ్వడం ఏమిటన్నారు. ఉద్యోగస్తులు రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వారం రోజుల పాటు పిండప్రదానం ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, రైతులు నమ్మి హరిగోస పడుతున్నారని చెప్పారు. రెప్పపాటు కరెంట్ కోతలు లేకుండా కె.సి.ఆర్ చేశారని, యూరియా కోసం రోడ్లపై పడిగాపులు పడాల్సివస్తుందన్నారు. నికర జలాలు ఆంధ్రావాళ్ళు దోచుకుపోతుంటే రేవంత్ మొద్దు నిద్రపోతున్నాడన్నారు. చంద్రబాబు మెప్పు కోసం రైతులను రేవంత్ దగా చేస్తున్నాడని, గురువు కళ్లలో ఆనందం కోసం రేవంత్ పిల్లిమొగ్గలు వేస్తున్నాడన్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ ఒక్కటై తెలంగాణ నీటి వాటాను ఆంధ్రకు అందిస్తున్నారన్నారు. 1000 రోజులలో లక్షా అబద్ధాలతో రేవంత్ పాలన కొనసాగిందన్నారు. ఒట్టులతో దేవుళ్ళను సహితం రేవంత్ మోసం చేశాడన్నారు  వై.ఎస్.ఆర్ ఫీజ్ రియాంబర్స్మెంట్ కె.సి.ఆర్ కొనసాగించారన్నారు. విదేశీ విద్య కోసం 20 లక్షలు కె.సి.ఆర్ అందించారన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 2లక్షల 30వేలు సర్కార్ బకాయి పడ్డదన్నారు. కె.సి.ఆర్ 2 లక్షల 5 వేల మందికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 1 లక్షా 63 వేల ఉద్యోగాలు కె.సి.ఆర్ ఇచ్చి 43 వేల ఉద్యోగాలకు సర్వం సిద్ధం చేశారన్నారు. రేవంత్ 100 రోజులలో 2లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడన్నారు కె.సి.ఆర్ ఆచరించిన వ్యవసాయ అభివృద్ధి వల్ల 2.5 కోట్ల మందికి ఉపాధి కె.సి.ఆర్ కల్పించారన్నారు. నూతన పరిశ్రమల వల్ల కె.సి.ఆర్ 16 లక్షల యువతకు ఉపాధి కల్పించారన్నారు. కె.సి.ఆర్ హయాములో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు 9 లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. అవ్వ తాతలకు 4000 అంటూ వృద్ధులను మోసం చేశారన్నారు. నమ్మితే ఆగం అయితారు అని నాటి కె.సి.ఆర్ మాట నిజమైందన్నారు. తెలంగాణ సమాజాన్ని హోల్ సెల్ గా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి సామూహిక బాధ్యత అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో నేను అన్న నియంత మునిగిపోవడం ఖాయం అన్నారు. ప్రజలను ఏమార్చితే నిన్ను బొంద పెట్టడం ఖాయమని సీఎం ను హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, పాలించే నైతికత లేదన్నారు. ఉలికి ఉలికి పడే నాయకులకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఇందిరమ్మ ఇండ్లపేరిట ప్రచారానికి వేల కోట్ల దుబారా చేశారన్నారు. కె.సి.ఆర్ పాలన రావడం తథ్యం.. సంక్షేమం సాగడం ఖాయమన్నారు. ప్రజలకు అండగా మేము ఉంటాం అధైర్యపడొద్దని తెలిపారు. 

భారీ ఫ్లెక్సి ప్రదర్శన
సభాస్థలిలో ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ చెందిన మోసపు హామీలు వివరిస్తూ 420 ఫీట్లు భారీ ఫ్లెక్సి సభికులను విశేషంగా ఆకర్షించింది. 6 గ్యారంటీలు, 420 హామీలు,11 డిక్లరేషన్లు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి బాగోతాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడంతో మహిళలు ఉద్వేగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన మోసపు హామీలు తలుచుకొని శాపనార్థాలు పెట్టారు.
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వాకిటి.శ్రీధర్, రమేష్ గౌడ్, బి.లక్ష్మయ్య, నందిమల్ల అశోక్, లక్ష్మారెడ్డి, కృష్ణా నాయక్, గంధం పరంజ్యోతి, రాజానగరం విజయ్ కుమార్, వెంకట్ సాగర్,కె.మాణిక్యం,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,వెంకటస్వామి,ఏం.తిరుపతయ్య,మాజీ కౌన్సిలర్స్ ఉంగ్లం.తిరుమల్,నాగన్నయాదవ్,బండారుంకృస్ణ,కాగితాల.లక్ష్మీనారాయణ, కౌన్సిలర్స్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి,మురళీ సాగర్, శ్రీకర్ గౌడ్,స్వాతి హరిబాబు,శంకరమ్మ బాబు నాయక్,ఏర్వ.అరుణ శ్రీనివాసులు, శిరీష రమేశ్ గౌడ్, హేమంత్ ముదిరాజ్, ఇమ్రాన్, రఘువర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,సర్పంచులు శోభా,నాగమ్మ,కవితా నాయక్,షెమీం బేగం,జమ్ములమ్మ,నాయకులు ఏం.వేణుగోపాల్,పలుస.శంకర్ గౌడ్,నందిమల్ల. రమేష్,గులాం ఖాదర్ ఖాన్, నీలస్వామి, బొబ్బిలి. ప్రేమ్ కుమార్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల.రాము,మంద.రాము,సిరిగిరి.మన్నెం,బాలరాజు వాల్మీకి,శిరీవాటి.శంకర్,అలీమ్,నందిమల్ల.సుబ్బు,తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -