Wednesday, September 2, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదు: మంత్రి కొండా సురేఖ

కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదు: మంత్రి కొండా సురేఖ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన C ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడారు.

అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్‌, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్‌లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -