Wednesday, September 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ముందు పిడుగు..వీడియో

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ముందు పిడుగు..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో ఆకస్మికంగా సంభవించిన పిడుగుపాటుకు తృటిలో ప్రాణపాయం తప్పింది. న్యూయార్క్‌లోని స్టాటెన్ ఐలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి గత గురువారం దంతవైద్యుడిని కలిసేందుకు వెళ్తుండగా, ఇంటికి కొద్ది దూరంలోనే అతని ముందు పిడుగు పడింది. ఈ ఘటన దృశ్యాలు అతని ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఆ భయానక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NBC న్యూస్ ప్రకారం, థామస్ ఫహ్మీ అనే వ్యక్తి న్యూయార్క్ లోని విండ్సర్ రోడ్ సమీపంలోని టోడ్ట్ హిల్ రోడ్ వెంబడి… తన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో అడుగుల దూరంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి పిడుగుపడింది. ఈ పిడుగు ధాటికి ఫహ్మీ కిందపడిపోయాడు. కరెంట్ షాక్ మాదిరిగా అతని బాడీ షేక్ అయిపోయింది. కొద్ది సమయం తర్వాత అతనే స్వయంగా లేచి నెమ్మెదిగా నడుచుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఫహ్మీని నార్త్‌వెల్ స్టేటెన్ ఐలాండ్ యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతన్ని రాత్రంతా వైద్యులు పర్యవేక్షించారు. ఎలాంటి హానికరమైన గాయాలు కాకపోవడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -