నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిలీలో ఏండ్ల క్రితంనాటి ఐదంతస్తుల సత్య నికేతన్ హాస్టల్ భవనం కూప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘుటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఏడుగురు మరణించారని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. శిథిలాల నుంచి మరో వ్యక్తిని వెలికితీయడంతో, రక్షించబడిన వారి మొత్తం సంఖ్య 12కు చేరిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఇన్‌స్పెక్టర్ జనరల్ నరేంద్ర సింగ్ బుందేలా మీడియాతో మాట్లాడుతూ..శిథిలాల నుంచి మరో వ్యక్తిని వెలికితీసేందుకు NDRF, అగ్నిమాపక సేవా బృందాలు పనిచేస్తున్నాయని,మొత్తం 12 మందిని వెలికితీశామని, వారిలో ఆరుగురు మరణించినట్లు ప్రకటించారు. ఐదుగురిని ఆసుపత్రుల్లో చేర్చామన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురికి ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కూప్పకూలిన ఐదంతస్తుల భవనం..పెరిగిన మృతుల సంఖ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



