నవతెలంగాణ – ఆర్మూర్
రూ.7 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ సోమవారం పట్టబడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో ఒక కాంట్రాక్టర్ వద్ద రూ.7వేల లంచం తీసుకుంటూన్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిసి రోడ్డు పనుల బిల్లుల విషయంలో కాంట్రాక్టర్ కు 4 లక్షల 75 వేల రూపాయల సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో పీఆర్ ఉద్యోగి రూ.7500 వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడని, అందులో భాగంగా 7వేల రూపాయలు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు అధికారుల సూచనలకు డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు జిల్లా ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు. ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసిబి అధికారుల దాడులతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. ఎసిబి అధికారులకు ఉన్న నిబంధనలు మేరకు సదరు కాంట్రాక్టర్ పేరును వెల్లడించబోమని డిఎస్పి చెప్పారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని డిఎస్పి తెలిపారు. ఆయనతోపాటు ఏసీబీ దాడుల్లో నిజామాబాద్ ఏసీబీ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.