Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజల సమస్యలపై విధించిన సస్పెన్షన్: హరీశ్‌ రావు

ప్రజల సమస్యలపై విధించిన సస్పెన్షన్: హరీశ్‌ రావు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వేసిన వేటు కాదని, తెలంగాణ ప్రజల సమస్యలపై విధించిన సస్పెన్షన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్షపూరితంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులను ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సస్పెన్షన్ కు గురైన తర్వాత మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే భయంతోనే ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -