Wednesday, September 9, 2026
E-PAPER
Homeజాతీయంస్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా..నోటీసు ఎలా ఇస్తారు?

స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా..నోటీసు ఎలా ఇస్తారు?

- Advertisement -
  • గ్రేటర్ నొయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు జారీచేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

నవతెలంగాణ-హైదరాబాద్: జులైలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పాల్గొన్నందుకు ఓ విద్యార్థికి గ్రేటర్ నొయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు జారీచేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని ఉల్లంఘించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఓ విద్యార్థికి మేజిస్ట్రేట్ నోటీసు ఎలా ఇస్తారు? విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ ఓ మేజిస్ట్రేట్‌కు అలా చేయడానికి ఎంత ధైర్యం?’ అని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ధర్మాసనం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ల నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -