Sunday, April 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైలులో భారీ దోపిడీ..బంగారం అపహరణ

రైలులో భారీ దోపిడీ..బంగారం అపహరణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రైలు దోపిడీ కలకలం రేపింది. బాపట్ల జిల్లాలో బెంగళూరు-నరసాపురం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు (07154)లో శనివారం అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులను బెదిరించి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న రైలు బాపట్ల-అప్పికట్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు నాలుగు స్లీపర్ కోచ్‌లను (S7, S11, S12, S13) లక్ష్యంగా చేసుకున్నారు. నిద్రలో ఉన్న ప్రయాణికులను నిద్రలేపి, కత్తులతో బెదిరించి వారి వద్దనున్న బంగారాన్ని లాక్కున్నట్లు తెలుస్తోంది.

దోపిడీ అనంతరం, దుండగులు అప్పికట్ల వద్ద రైలును ఆపి, చీకట్లోకి దూకి పరారయ్యారు. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. పాత నేరస్థుల జాబితాను పరిశీలిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -