- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 11, 12, 13 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
- Advertisement -



