నవతెలంగాణ-హైదారాబాద్: AIADMK అమిత్షా, మోడీల ఆధీనంలో ఉందని, బీహార్ తరహాలోనే సీఎంను మార్పు చేస్తారని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తూత్తుకూడి నియోజకవర్గంలో ప్రచార ర్యాలీలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్లో ఏం జరిగిందో తమిళ ప్రజలు గమనించాలని, అక్కడ ప్రజలు ఎన్నుకున్న సీఎంను తొలగించారని తెలియజేశారు. బీజేపీ వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేశారని, అదే విధంగా AIADMK గెలిచినా.. మోడీ, అమిత్ షా బీహార్ మాదిరిగానే సీఎంను మార్పు చేస్తారని ఆరోపించారు. ఈ తరహా మార్పును నితిష్ కుమార్ వ్యతిరేకించలేదని, మౌనంగా రాజ్యసభకు వెళ్లిపోయారని మండిపడ్డారు. నితిష్ బాటలోనే AIADMK నేతలు నడుస్తారని, బీహార్లో చేసినట్లే తమిళనాడులో కూడా చేయాలని షా, మోడీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో అధికారం చెలాయించడం వాళ్ల కాదని, తమిళ ప్రజల కాంక్షను వారు అనుగుణంగా పాలనసాగించలేరని చెప్పారు.
బీహార్ మాదిరిగానే తమిళనాడులో బీజేపీ కుట్రలు: రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



