- Advertisement -
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ హెడ్‌గా జనరల్ మేనేజర్ పిచ్చయ్య ఎం బాధ్యతలు స్వీకరించారు. 1993లో బ్యాంకులో చేరిన ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఏడు రీజియన్ల కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించనున్నారు. బ్యాంక్ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఈ జోన్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్ట్టి సారిస్తానని పిచ్చయ్య ఎం తెలిపారు.
- Advertisement -



