Monday, April 20, 2026
E-PAPER
Homeబీజినెస్బంగ్లాదేశ్‌లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

బంగ్లాదేశ్‌లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

- Advertisement -

ఢాకా : బంగ్లాదేశ్‌ లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 10శాతం నుండి 15శాతానికి పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరగడం, ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ధరలను పెంచినట్లు ఇంధన శాఖ శనివారం ర్రాతి వెల్లడించింది. పెంచిన ధరలతో, పెట్రోల్‌ లీటరుకు 116 టాకాల నుండి 135 టాకాలకు, డీజిల్‌ 115 టాకాలకు, కిరోసిన్‌ 130 టాకాలకు చేరింది. ధరల పెంపు, ముఖ్యంగా డీజిల్‌ ను విస్తతంగా వినియోగించే రవాణా, వ్యవసాయ రంగాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మరింత పెంచుతుందని, దీంతో ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -