Monday, April 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజనగణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్‌

జనగణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్‌

- Advertisement -

– కల్వకుంట్ల కవిత డిమాండ్‌
– మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొరతో భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జనగణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్‌ రైట్స్‌ అండ్‌ కల్చరల్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ జాతీయ అధ్యక్షులు, ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు హైదరాబా ద్‌లోని జాగృతి కార్యాలయంలో ఆదివారం కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల తో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా వివరిం చారు. అనంతరం కవిత మాటా ్లడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం క్యాటగిరీలో ఆదివాసీ అనే కాలమ్‌ పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -