Monday, April 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాసేవకు బూర్జువా పార్టీలు అడ్డు ఆ పార్టీలను వదిలేయండి

ప్రజాసేవకు బూర్జువా పార్టీలు అడ్డు ఆ పార్టీలను వదిలేయండి

- Advertisement -

– ఉద్యమకారులు ఐక్యంగా కదిలి రండి :కల్వకుంట్ల కవిత
– జాగతిలో చేరిన బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజాసేవకు అడ్డుగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి ఉద్యమకారులు కొత్త రాజకీయ శక్తిగా మారబోతున్న తెలంగాణ జాగతిలో చేరాలని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, సిరిసిల్ల జిల్లా మండల అధ్యక్షునితో పాటు నియోజకవర్గ నాయకులు జాగృతిలో చేరారు. ఆమె వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కవిత మాట్లాడుతూ జాగృతి ద్వారా బీఆర్‌ఎస్‌లో చేరిన బాపూరావు తిరిగి జాగృతిలోకి రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాన్ని వదులుకుని బాపూరావు తెలంగాణ ఉద్యమంలో పని చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ ఆకాంక్షతో తెలంగాణ కోసం ఉద్యమించామో అదే ఆకాంక్షతో మరోసారి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాలని కవిత సూచించారు. ఉద్యమకారులంతా ఏకతాటిపైకి రావాలని ఆమె ఆకాంక్షించారు. వానపడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదనీ, ఆ పరిస్థితి నుంచి మార్పు కోసమే తెలంగాణ సాధన కోసం ఐక్యంగా ఉద్యమించామని ఆమె గుర్తుచేశారు. నాడు ఆదిలాబాద్‌లో మెడికల్‌ క్యాంపులు పెట్టామని తెలిపారు. జాగతి ద్వారా బీఆర్‌ఎస్‌లో చేరి బాపూరావు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారన్నారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు జాగతి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -