Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఐటిఐలో దరఖాస్తుల ఆహ్వానం ..

ఐటిఐలో దరఖాస్తుల ఆహ్వానం ..

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి  : ప్రభుత్వ, ప్రయివేట్ ఐటిఐ కళాశాలలో మొదటి రెండవ సంవత్సరం విద్యా సంవత్సరాలకు విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26/27 విద్యా సంవత్సరానికి ఐటిఐ కళాశాలలో చేరే విద్యార్థులు తమ తమ దరఖాస్తులను ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జూన్ రెండవ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి అని జూన్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చన్నారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ పదవ తరగతి మెమో, కుల ధ్రువీకరణ పత్రము, తీసి, ఆరు తరగతులు తెలంగాణలో చదువుకున్నట్లు ధ్రువకరించే పత్రాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. విద్యారహత, కోర్సు,సిలబస్ తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరిచాయన్నారు. వాటిని చూసుకుంటూ విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఈ సందర్భంగా వారు కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img