Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భూసమస్యల పరిష్కారానికే భూభారతి సదస్సులు 

భూసమస్యల పరిష్కారానికే భూభారతి సదస్సులు 

- Advertisement -

 నవతెలంగాణ – వలిగొండ రూరల్
రైతుల భుసమస్యల  పరిష్కరించడానికె గ్రామాలలో భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వర్కట్ పల్లి, ఎం తుర్కపల్లిలో భూభారతి సదస్సులు నిర్వహించారు. వర్కట్ పల్లి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులకు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న భూసమస్యలకు నేటి నుండి 20 వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ సదస్సులో  దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం  అధికారులు విచారణ చేపట్టి వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని, ఈ సదవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి రోజు రైతులనుండి ఎం తుర్కపల్లిలో 13 దరకాస్తులు, వర్కట్ పల్లి లో 5 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ, డిప్యూటీ తహశీల్దార్,  రెవెన్యూ అధికారులు మనోహర్, కర్ణాకర్ రెడ్డి, నాగేష్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img