Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి..

ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్( 28)అనే యువకుడు ట్రాక్టర్  కింద పడి మంగళవారం సాయంత్రం మృతి చెందిన ఘటన త్రీవ విషాదం నింపింది. పూర్తి వివరాలకు వెళ్తే.. స్థానికుల కథనం ప్రకారం.. ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన  ఓ రైతుకు  చెందిన చేనులో ట్రాక్టర్ రోటివేటర్ భూమిని చదును చేస్తుండగా.. ట్రాక్టర్ పైన కూర్చున్న ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి రోటివెటర్లో చిక్కుకున్నారు. దీంతో వెంటనే గమనించిన డ్రైవర్ బంద్ చేసి చూసేసరికి యువకుడు మృతి చెందాడు. మృతుని  కుటుంబానికి  న్యాయం చేయాలని, మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు శవాన్ని తరలించుటాన్ని  అడ్డుకున్నారు. మృతిని కుటుంబానికి న్యాయం జరిగిన తర్వాతనే శవం పోస్టుమార్టం తరలించాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం ప్రమాద తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేశారు. అంతలోనే ఎస్సై తన సిబ్బందితో గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అయితే మంగళవారం రాత్రి 9 గంటల వరకు మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించకపోవడం గమనార్హం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img