- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ అమానుషంగా దాడి చేశాడు. మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



