Saturday, September 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తగ్గిన చక్కెర ధరలు!

తగ్గిన చక్కెర ధరలు!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బహిరంగ మార్కెట్‌లో పంచదార ధరలు గణనీయంగా తగ్గాయి. గత మూడు వారాల్లో కిలో ధర దాదాపు 10% తగ్గి రూ. 65 నుంచి రూ. 58.50కి చేరింది. చక్కెర కొరతను నివారించడానికి, వినియోగదారులకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చక్కెరను ఉపయోగించే వ్యాపారులు, పారిశ్రామిక వినియోగదారుల నిల్వ పరిమితిని 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది. అయితే, అదనపు నిల్వలు దిగుమతి చేసుకున్న చక్కెర లేదా అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద సేకరించిన చక్కెర ద్వారానే భర్తీ చేసుకోవాలని షరతు విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -