Monday, September 21, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇందిరమ్మ టవర్స్‌ పథకం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్..

ఇందిరమ్మ టవర్స్‌ పథకం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి లబ్ధిదారులకు వాట్సాప్‌ ద్వారా అధికారికంగా అలాట్‌మెంట్‌ లెటర్లను అందజేయనున్నారు. వాట్సాప్‌ సేవలతో పాటు లబ్ధిదారులు నేరుగా హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తమ అలాట్‌మెంట్‌ లెటర్లను పొందేలా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీంతో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా తమ పత్రాలను పొందవచ్చు.
రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
నేడు (సోమావారం) ఉదయం రాయదుర్గం మల్కం చెరువు వెనుక భాగంలో 2.85 ఎకరాల విశాలమైన స్థలంలో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -