Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంపిల్లలకు దగ్గు మందు వాడకంపై కేంద్రం కీలక చర్యలు..

పిల్లలకు దగ్గు మందు వాడకంపై కేంద్రం కీలక చర్యలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నాలుగేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు వాడకాన్ని తగ్గించేలా ఔషధ నియంత్రణ సంస్థ కీలక మార్పులకు సిద్ధమవుతోంది. దగ్గు మందు సీసాలపై ‘నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం’ అంటూ ఎరుపు రంగులో హెచ్చరిక ముద్రించాలని ప్రతిపాదించింది. ప్యాకేజింగ్‌పై పాఠశాల వయస్సు పిల్లల చిత్రాన్ని కూడా ఉంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను డ్రగ్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ పరిశీలనకు పంపారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో కేంద్రం దగ్గు మందులు, సిరప్‌లను ఓటీసీ విభాగం నుంచి తొలగించి.. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -