- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైలు కిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్-నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖం, తల ఛిద్రం కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.
- Advertisement -


