Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలునవరాత్రి ఉత్సవాల్లో విషాదం..ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

నవరాత్రి ఉత్సవాల్లో విషాదం..ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో సంతోషంగా గడిపిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జవహర్‌నగర్‌  ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా ప్రశాంత్‌నగర్‌ సాయిహోమ్స్‌లో ఆర్టీసీ కానిస్టేబుల్‌ మార్తాల సూర్యనారాయణరెడ్డి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన శనివారం రాత్రి వారి అపార్ట్‌మెంటులో కుటుంబంతో కలిసి వినాయక పూజ నిర్వహించారు. వారితో పాటు ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆయన స్నేహితుడు గంధం వినయ్‌ కుమారుడు అమర్త్య (15) కూడా పూజలో పాల్గొన్నాడు. అమర్త్య వారి మండపం వద్ద అన్నదానం ఉందని చెప్పాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్న సూర్యనారాయణరెడ్డి కుమార్తె వెంకట దీప్షికారెడ్డి (21) అమర్త్యతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడ రాయల్‌ కేఫ్‌ సమీపంలో రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పింది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న దీప్షికా, వెనక కూర్చున్న అమర్త్య రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో మట్టి లోడుతో వస్తున్న టిప్పర్‌ వెనుక చక్రాలు దీప్షికాపై నుంచి వెళ్లాయి. అమర్త్య తలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరూ ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందారు.  టిప్పర్‌ డ్రైవర్‌ గుంజ నర్సింహను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -