- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు, మంత్రులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు నింపడంపై దృష్టి సారించడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
- Advertisement -



