నవతెలంగాణ-భీంగల్
భీంగల్ రామన్న కుంట, కప్పల వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను గురువారం అధికారులు పరిశీలిస్తున్నారు. నిమజ్జనం రాత్రి వేళలో సాగుతుంది కాబట్టి కుంట వద్ద, వాగు వద్ద మౌలిక వసతులు రూట్ మ్యాప్ పర్యవేక్షించిన అనంతరం (రోడ్డు, లైటింగ్, అలంకరరణ, పర్యవేక్షించి గజ ఇతగల్లను ఏర్పాటుచేసిన మున్సిపల్ సిబ్బంది). అధికారులు మాట్లాడుతూ.. భీంగల్ పట్టణ ప్రజలకు, వినాయక మండప నిర్వాహకులకు శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలని పోలీసులు సూచించారు. అందుకు మున్సిపల్, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు. పట్టణవాసులు నచ్చిన చోట వినాయక నిమజ్జనం చేసుకోడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే తగిన చర్యలను తీసుకుంటామని పోలీస్ శాఖ, రెవిన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, అధికారులు హెచ్చరించారు.
గణనాథుని నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



