- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని తడి హిప్పరుగా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా అన్నారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు మూడో విడతగా ఎమ్మెల్యే సహకారంతో 11 ఇండ్లు మంజూరైనట్లు వాటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు మార్కౌట్లు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకొన్ని ఇండ్లు మంజూరైతే గుడిసెలు లేని గ్రామంగా 100% తడి హిప్పర్గా నిలుస్తుందన్నారు. ఈ ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి జ్యోతి, పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



