- కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ భారతదేశ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించారని డిప్కే ఆరోపించారు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ఎవరు ఓటు వేయాలి , ఎవరు వేయకూడదు అనే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తోందని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించబడ్డాయి. ఇది చిన్న సంఖ్య కాదు, ఈ తొలగింపు మొత్తం ఓట్లలో సుమారు 13-14 శాతానికి సమానమని తెలిపారు.
ఈ నేపథ్యంలో తాజా పత్రికా సమావేశంలో అభిజీత్ దీప్కే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై మండిపడ్డారు. ఈ ఉదంతాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి అని నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే 48 గంటల్లోగా ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసనలకు తెరతీస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు.



