Homeజిల్లాలుపిట్టల రమేష్ మృతి పార్టీకి తీరని లోటు 

పిట్టల రమేష్ మృతి పార్టీకి తీరని లోటు 

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య 
నవతెలంగాణ-మర్రిగూడ 
పిట్టల రమేష్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. మండలంలోని శివన్నగూడ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో పార్టీ బలోపేతాని ఆయన ఎంతో కృషి చేశారని, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి పోతాయని గుర్తు చేస్తూ విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిద్దగోని మహేష్, లపంగి చంద్రయ్య, ఊరు పక్క కృష్ణ, మోర యాదయ్య, పూల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -