రిమ్స్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ రిమ్స్‌లోని ఎస్ఎన్.సీయూ యూనిట్‌లో ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్. మంజుల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రిమ్స్‌లో మిగిలిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆస్పత్రిలో లిఫ్టులు పనిచేయకపోవడం, మందుల కొరత, ఏసీలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఏసీలు పనిచేయక ఆపరేషన్లు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయని, కొందరు అంకితభావం కలిగిన వైద్యులు సొంత ఏసీలు తెచ్చుకుని ఆపరేషన్లు నిర్వహించారని పేర్కొన్నారు. రిమ్స్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఖాళీల భర్తీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంజుల డిమాండ్ చేశారు.
రిమ్స్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -



