Homeఆదిలాబాద్సేవా కార్యక్రమాలతోనే సమాజ అభివృద్ధి

సేవా కార్యక్రమాలతోనే సమాజ అభివృద్ధి

- Advertisement -

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం
నవతెలంగాణ-బజార్‌హత్నూర్
సేవా కార్యక్రమాలతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎం. వనజ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) లక్ష్యాలు, సమాజ సేవలో విద్యార్థుల పాత్రపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్, కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ షిండే జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. సమాజ అభివృద్ధికి యువత తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె. సుభాష్, సి. నవీన్ రెడ్డి, ఎం. రామారావు, కె. గగాధర్, బి. ప్రదీప్ కుమార్, అశోక్ రెడ్డి, బి. భీమేష్, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -