Homeతెలంగాణ రౌండప్అంగన్‌వాడీలో పోషణమాసం

అంగన్‌వాడీలో పోషణమాసం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
డోంగ్లి మండలంలోని హసన్ టాక్లీ అంగన్వావాడి కేంద్రంలో సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు పోషణ మాస కార్యక్రమం నిర్వహిస్తామని అంగన్వాడి టీచర్ సచిత తెలిపారు. తల్లులు, గర్భిణీలు బాలింతలు, కిషోర్ బాలికలకు క్విజ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం టీచర్‌ మాట్లాడుతూ..బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి మొర్రుపాలు పట్టాలని, ఆరు నెలల వరకు ఖచ్చితంగా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఏడో నెల నుండి మూడు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు బాలామృతం, పౌష్టికారం అందించాలని చెప్పారు. రక్త పరీక్షలో హిమోగ్లోబిన్ పెరుగుదలకు ఐరన్ మాత్రలు గుడ్లు, బెల్లంపల్లిలో నువ్వులు, చేపలు, చిరు ధాన్యాలు, ఎండు ద్రాక్ష, మొకెత్తిన గింజలు, ఆకుకూరలు కూరగాయలు, ప్రోటీన్స్ ఎక్కువ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షురాలు గంగామణి, గ్రామ ఆశా వర్కర్ అన్నపూర్ణ,  తల్లులు పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -