Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి

ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత యువ డాక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్యాంపస్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వదేశీ కార్యకర్తలు క్యాంపస్ ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. పర్యావరణ సమతుల్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా స్వదేశీ జాగరణ మంచ్ విచార విభాగ ప్రముఖ అధ్యాపకులు డాక్టర్ యాలాద్రి, జిల్లా సహా సంయోజక్ రాజేశ్వర్ గౌడ్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధులు మహేష్ రెడ్డి, సంతోష్, పోతన్న, ఈకో క్లబ్ సభ్యులు రాజశేఖర్, నాగరాజు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img