నవతెలంగాణ – హైదరాబాద్: మద్యం మత్తులో భార్య, అత్తపై కత్తితో అల్లుడు దాడి చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో చోటు చేసుకున్నది. మహేష్, శ్రీదేవి దంపతులు హఫీజ్ పేట్ జనప్రియనగర్ లో నివాసం ఉంటున్నారు. కాగా వీరికి 2022లో ప్రేమ వివాహం జరిగింది. మహేష్ ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా తరచూ మహేష్ దంపతులు గొడవపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా గొడవ పడగా.. భార్య శ్రీదేవితోపాటు అత్తపై మహేష్ కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయాల పాలైన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
మియాపూర్ లో దారుణం.. మద్యం మత్తులో అత్త,భార్యపై కత్తితో అల్లుడి దాడి
- Advertisement -
RELATED ARTICLES