నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరి కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్‌లో ముగ్గురు, ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -