Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరెండో డీఏ ఆగస్టులో చెల్లించాలి : ఎమ్మెల్సీ కొమరయ్య

రెండో డీఏ ఆగస్టులో చెల్లించాలి : ఎమ్మెల్సీ కొమరయ్య

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులకు మొదటి డీఏను వెంటనే చెల్లిస్తామనీ, రెండో డీఏను ఆర్నెల్ల తర్వాత చెల్లిస్తామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైంది కాదనీ, ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో సంతృప్తి పర్చలేదని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. రెండో డీఏను ఆగస్టులోనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామనీ, హెల్త్‌ కేర్‌ ట్రస్టు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చేనెలలో మరో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని తెలిపారు. డిసెంబర్‌లోపు అన్ని డీఏలనూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తరగతికి ఒక టీచర్‌ ఉండేలా నిబంధనలు మార్చాలని సూచించారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ను అమలు చేయాలని తెలిపారు. మోడల్‌ స్కూల్‌, గురుకుల సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలకు పది వేల హెడ్మాస్టర్‌ పోస్టులను మంజూరు చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad